NTV Telugu Site icon

Andhra Pradesh: 50 వేలు దాటిన మద్యం షాపుల దరఖాస్తులు.. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం

Ap Liquor

Ap Liquor

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. కాగా.. మద్యం షాపుల దరఖాస్తులు 50 వేలు దాటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం వచ్చిందని అన్నారు. మద్యం షాపుల దరఖాస్తులు రేపు 7 గంటల వరకు ఎక్సైజ్ శాఖ స్వీకరించనుంది. సిండికేట్‌ను కట్టడి చేయడం, మద్యం షాపుల దరఖాస్తుల్లో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నివారించే ప్రయత్నం చేయడంతో దరఖాస్తులు భారీగా దాఖలయ్యాయి.

Read Also: Hyderabad: లంచం తీసుకోకుండా ఇంటికి రాదు.. భార్య లంచగొండితనం బయటపెట్టిన భర్త

ఏపీఎస్బీసీఎల్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ మాట్లాడుతూ.. అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఉంటుందని తెలిపారు. విభిన్న వర్గాల నుంచి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించామన్నారు. ఆన్ లైన్ తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 14వ తేదీన ఆయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తామన్నారు. అదే రోజు కేటాయింపు ప్రకియను పూర్తి చేస్తామని తెలిపారు. అక్టోబరు 16 వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రవేటు మద్యం షాఫులు అందుబాటులోకి వస్తాయని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: PM Modi: ‘‘దళితుల్లో అసత్యాలని వ్యాప్తి చేస్తోంది’’.. కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన పీఎం మోడీ..