NTV Telugu Site icon

Duplicate Medicines: కోట్ల విలువైన నకిలీ మందులు సీజ్..

Duplicate Medicines Making

Duplicate Medicines Making

Duplicate Medicines Making: ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది. ఈ దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. దాదాపు రూ.2 కోట్ల 93 లక్షల విలువ కలిగిన 255 మందుల తయారీ యంత్రాలను కూడా సీజ్ చేశారు. స్ట్రీట్ నంబర్ 20, శైలేష్ ఇండస్ట్రీ, గీతా గోవింద్ ఇండస్ట్రీ, నవ్‌ఘర్, వసాయ్‌ లో ఈ దాడి జరిగింది. ఈ కంపెనీ గడిచిన 7 సంవత్సరాలుగా నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీ ఘర్వార్ ఫార్మా ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రుసాబ్ ఫార్మా పేరుతో రిజిస్టర్ చేసి ఉంది. దీని లైసెన్స్ పంచకుల నుండి వచ్చింది. కాకపోతే ఔషధం తయారీ మాత్రం వసాయ్‌ లో ప్రారంభమైంది.

Fact Check: ఆ రెవెన్యూ రికార్డు నకిలీది.. ఏపీ ప్రభుత్వం

జాయింట్ కమిషనర్ ఎఫ్‌డిఎ విజిలెన్స్ డాక్టర్ రాహుల్ ఖాడే తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్‌డిఎ దాడులు నిర్వహించి రూ.1 కోటి 27 విలువైన వస్తువులు, కోట్ల విలువ చేసే యంత్రాలను స్వాధీనం చేసుకుంది. ఎఫ్‌డీఏ అధికారులు దాడులు నిర్వహించగా హర్యానాలోని పంచకులలో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు కంపెనీకి లైసెన్స్ ఉన్నట్లు తేలింది. నకిలీ మందులను తయారు చేస్తున్న కంపెనీ డైరెక్టర్, భాగస్వామి అయిన ధీరేంద్ర జనార్దన్‌ పై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌డిఎ నుండి సూచనలు వచ్చాయి. ఘటనా స్థలం నుంచి నకిలీ ఉత్పత్తుల తయారీకి ఉంచిన ముడిసరుకును ఎఫ్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Vegetable Prices: పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

ఎఫ్‌డీఏ విజిలెన్స్‌ అధికారి వీఆర్‌ రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కంపెనీ నకిలీ మందులను విక్రయిస్తోందని.. శాఖాపరమైన సమాచారం మేరకు విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల కూడా, వాసాయిలో నకిలీ సౌందర్య సాధనాల తయారీ కంపెనీపై FDA దాడి చేసింది. ఇక్కడ లోరియల్ కంపెనీకి చెందిన నకిలీ ఉత్పత్తిని తయారు చేసి అమ్మేస్తున్నారు. నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ కంపెనీ పలు నకిలీ ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతున్నట్లు శుక్రవారం నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది.