కౌగిలించుకోవడం అనేది.. ప్రేమతో ఆలింగనం చేసుకోవడం.. మనకు అత్యంత ప్రియమైన వారిని కౌగించుకోవడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుందో మాటల్లో చెప్పలేనిది.. ఇరు మనసుల్లో ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు హగ్ ఇద్దరి ఒత్తిడి, యాంగ్జైటీనీ దూరం చేస్తుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చాలా మంది తమ భాగస్వాములను తరచుగా కౌగిలించుకుంటారు. అయితే ఈ కౌగిలింత కూడా భాగస్వాములతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా సహాయపడుతుంది.. కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*. కౌగిలింత ఆరోగ్యకరమైన చర్య. ఎందుకంటే ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. పెన్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. వారి వారి భాగస్వాములను కౌగించుకునేవారికి శారీరక స్పర్శలో అరుదుగా పాల్గొనే ఆడవారి కంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది..
*. మీకు ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది సంతోషకరమైన హార్మోన్. ఇది మీకు ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ అనే హార్మోన్ ను తగ్గిస్తుంది..
*. కౌగిలి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అవును గాయం తర్వాత భాగస్వామిని కౌగిలించుకుంటే అంతగా నొప్పి పుట్టదట. ఎందుకంటే కౌగిలింతతో రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ నొప్పి సంకేతాలను నిరోధించడానికి సహాయపడుతుంది.
*. ఇష్టమైన వారి కౌగిలిలో మీరు సురక్షితంగా భావిస్తే మీరు ప్రశాంతంగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.. దాంతో మంచి నిద్ర వస్తుందని నిపుణులు చెబుతున్నారు..
*. ఇకపోతే కౌగిలి నేను సేఫ్ గా ఉన్న అనే భావనను కలిగిస్తుంది. మీతో వారు సురక్షితంగా ఉన్నారని ఫీలవుతారు. హగ్ మీలో ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హాన్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.. రొమాంటిక్ మూడ్ ను కలిగిస్తుంది..