Site icon NTV Telugu

Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధం: హరీష్ రావు

Harish Rao

Harish Rao

Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా నోటీసులు ఇవ్వలేదని, ఘోష్‌ కమిషన్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. కమిషన్లను రాజకీయ ఆయుధాలుగా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయని గుర్తు చేశారు. నిబంధనలు అనుసరించలేదనే కోర్టుకు వెళ్లామని చెప్పారు. ఆదివారం రిపోర్ట్‌ పెట్టారంటేనే కుట్ర ఉన్నట్లు, అందుకే సుప్రీంకోర్టులో సీఎం కేవియేట్‌ వేశారని అన్నారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారు, పారదర్శకంగా విచారణ జరగకపోతే అవి చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు.

READ ALSO: Ram Charan : రామ్ చరణ్ కు సీఎం ఆత్మీయ సన్మానం

వాస్తవాలు ప్రజలకు తెలియాలని, నాలుగు రోజులైన చర్చ చేస్తామని చెప్పారు. కానీ అరగంట సమయం ఇస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా… సర్కస్ నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. 1952 యాక్ట్ రక్షణ ఉందని, శాసన సభ్యుడి మీద ఆరోపణలు చేయాలంటే…సభ్యుడికి నోటీస్ ఇవ్వాలని అన్నారు. మేడిగడ్డలో లోపం లేక ముందే తప్పుడు ఆరోపణలు చేసిందని, ఘోష్ కమీషన్ రాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. తమకు 8 b కింద నోటీస్ లు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆనాడు షా కమిషన్‌ ఇందిరాగాంధీకి 8B కింద నోటీసులు ఇచ్చింది. అయినా ఇందిరాగాంధీ కోర్టుకు వెళ్తే షా కమిషన్‌ను కొట్టివేసిందన్నారు. LK అద్వానీపై కమిషన్‌ వేస్తే అన్యాయమని బీజేపీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ప్రోసీజర్‌ అనుసరించలేదని ఆనాడు లిబ్రహాన్‌ కమిషన్‌ను కోర్టు కోట్టివేసింది. రిపోర్టును క్వాష్‌ చేయాలనే మేం కోర్టుకు వెళ్లాం. సభలో చర్చ చేయొద్దని కోర్టుకు వెళ్లలేదని చెప్పారు.

READ ALSO: Kadiyam Srihari : దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి దిశగా కీలక నిర్ణయం

Exit mobile version