NTV Telugu Site icon

Pakisthan: బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని ముష్కరులు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు హతం

Pakisthan

Pakisthan

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బలూచిస్థాన్ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఈ సమాచారం ఇచ్చింది. నివేదికల ప్రకారం.. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం కారణంగా బషీర్ అహ్మద్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. డేరా మురాద్ జమాలీలో మొదటి సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు తరలించారు. విచారణ అనంతరం అహ్మద్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

PM Modi LIVE: ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

నివేదికల ప్రకారం.. మరొక సంఘటనలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు గండేరి ప్రాంతంలో గొర్రెల కాపరిని కాల్చి చంపారు. గొర్రెల కాపరిపై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు బైక్ ను అక్కడికక్కడే వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు. కాగా.. కుటుంబ కలహాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..

ఇదిలా ఉంటే.. పంజ్‌గూర్‌లో గుర్తుతెలియని సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నేషనల్ పార్టీకి చెందిన మీర్ బాలాచ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడిలో మీర్ గాయపడ్డాడు. దాడి తర్వాత.. బాలాచ్ ఖాన్‌ను అధునాతన వైద్య చికిత్స కోసం కరాచీకి తీసుకెళ్లారు.