Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఈ రోజు సాయంత్రం విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకోవడానికి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఇండియా కూటమి నేతలు, ఆప్ నేతలు జైలు వద్ద గుమిగూడారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ తివారీలతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్‌కి స్వాగతం పలికారు.
Read Also: Viral Video : ఏందయ్యా ఇది.. పామును అమాంతం మింగేసిన కప్ప.. వీడియో వైరల్..
Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
తనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకి, న్యాయమూర్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల్ని నియంతృత్వ పాలన నుంచి బయటపడేయడానికి పోరాడాల్సి ఉందని అన్నారు. సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల వల్లే తాను మీ ముందర ఉండగలిగానని వ్యాఖ్యానించారు. తన విడుదలకు హనుమంతుడు కారణమని, శనివారం ఉదయం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం నినాదాలు చేశారు. ఈ రోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని, తాను త్వరలోనే బయటకు వస్తానని చెప్పాను, వచ్చానని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal addresses party workers after being released from Tihar jail.
CM Kejriwal says, "Tomorrow at 11 am we will go to the Hanuman Temple at Connaught Place and at 1 pm, we will address a press conference at the party office."
The Supreme Court… pic.twitter.com/76ij5KZ4iw
— ANI (@ANI) May 10, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal addresses party workers after being released from Tihar jail.
CM Kejriwal says, "I had promised to come back soon, here I am. pic.twitter.com/qw5bKJJUZB
— ANI (@ANI) May 10, 2024
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి