Site icon NTV Telugu

Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!

Hrithik Roshan

Hrithik Roshan

Hrithik Roshan: భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గ్లోబల్ లెవెల్ కలయిక శుక్రవారం అధికారికంగా వెలుబడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన హోంబలే ఫిల్మ్స్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కలయిక దేశవ్యాప్తంగా సినిమాభిమానుల మధ్య భారీ హైప్‌ క్రియేట్ అయింది.

Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!

ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ఈ కలియిక పై మేం చాలా ఆనందంగా ఉన్నాం.. హోంబలే ఫిల్మ్స్‌ లో మేము సరిహద్దులను దాటి ప్రేక్షకులను తాకే కథల్ని తీసుకొస్తామన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హృతిక్ రోషన్ వంటి స్టార్ నటుడితో కలిసి పనిచేయడం ఆ దిశలో మరో ముందడుగు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఊహాతీతంగా, శక్తివంతమైన అనుభూతిని తెచ్చే సినిమాను రూపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు.

ఇక ఈ విషయమై హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. హోంబలే ఫిల్మ్స్ గత కొంతకాలంగా చాలా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేక అనుభూతి. మా కలల్ని రూపొందించేలా చేస్తూ, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అని హృతిక్ తెలిపారు.

Read Also: SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

‘KGF’ చాప్టర్ 1 అండ్ 2, సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్, కాంతార లాంటి సూపర్ హిట్స్ తో హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే భారతీయ సినీ రంగంలో తమదైన ముద్ర వేసింది. వీరి కథా శైలిలో బలం, విజువల్ గ్రాండర్ లో అద్భుతమైన ప్యాకేజీతో సినిమాలు రూపొందించడం వీరి ప్రత్యేకత. ఇక హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఫిజికల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ పవర్, అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. ప్రస్తుతం వార్ 2, క్రిష్ 4 లాంటి భారీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు హోంబలేతో కలయిక అభిమానులకు మరో సర్ప్రైజ్ కానుంది.

Exit mobile version