Tadka Buttermilk Recipe: వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం..! ఇంట్లోనే సులువుగా తడ్కా మజ్జిగ ఇలా తయారు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadka Buttermilk Recipe: వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, డీహైడ్రేషన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వేళల్లో మజ్జిగ ఉత్తమ పానీయంగా భావిస్తారు. ముఖ్యంగా తడ్కా మజ్జిగ లేదా మసాలా మజ్జిగ తాగితే శరీరం చల్లబడటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం కోసం మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది.. అయితే, సాధారణంగా చాలామంది మార్కెట్లో దొరికే మసాలా మజ్జిగను కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇంట్లోనే కొద్దిపాటి పదార్థాలతో ఎంతో రుచికరమైన తడ్కా మజ్జిగను సులభంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ లేదా ధాబాల్లో దొరికే రుచిని మీ ఇంటికే తీసుకురావచ్చు.
తడ్కా మజ్జిగకు కావలసిన పదార్థాలు
* 2 కప్పుల తాజా పెరుగు
* 1 కప్పు చల్లటి నీరు
* సన్నగా తరిగిన పచ్చిమిర్చి
* తురిమిన అల్లం
* పచ్చి కొత్తిమీర
* నల్ల ఉప్పు
* వేయించిన జీలకర్ర పొడి
* చిటికెడు ఇంగువ
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
తాలింపు కోసం
* 1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె
* ఆవాలు
* కరివేపాకు
* ఎండు మిరపకాయలు
తయారీ విధానం
ముందుగా పెరుగును ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత చల్లటి నీటిని కలిపి పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇంగువ, ఎండు మిరపకాయలు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఈ వేడి తాలింపును మజ్జిగలో పోసి వెంటనే మూత పెట్టాలి. ఇలా చేస్తే తాలింపు సువాసన మజ్జిగలో బాగా కలుస్తుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి చల్లగా వడ్డించాలి.
ప్రత్యేక చిట్కా
మజ్జిగకు పల్లెటూరి పొగ వాసన రావాలంటే చిన్న బొగ్గు ముక్కను మండించి ఒక చిన్న గిన్నెలో పెట్టాలి. దానిపై కొద్దిగా నెయ్యి చిలకరించి మజ్జిగ పాత్రలో ఉంచి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత తీసేస్తే అసలైన ధాబా స్టైల్ రుచి వస్తుంది. మొత్తంగా తడ్కా మజ్జిగ వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసట తగ్గించి శక్తిని ఇస్తుంది. నీరసం, వేడి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వేసవిలో ఇంట్లోనే ఈ రుచికరమైన తడ్కా మజ్జిగను తయారు చేసి కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!