Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Smelling Fresh Naturally: ప్రతిఒక్కరూ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇల్లు తాజాగా, పరిశుభ్రంగా ఉండడం అందరికీ నచ్చుతుంది. అయితే కొంతమంది ఇంట్లో ఎటువంటి చేదు వాసనలు రాకుండా.. సువాసన కోసం సుగంధ కొవ్వొత్తులు, ఎయిర్ ఫ్రెషనర్లు లేదా బాగా సువాసనలున్న క్లీనింగ్ ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని తలనొప్పి, అలర్జీ వంటి సమస్యలను కలిగించవచ్చు. దీంతో ఎలాంటి ఘాటైన సువాసనలు ఉపయోగించకుండా ఇంటిని తాజాగా ఉంచడం ఎలా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టె కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇవే..
కిటికీలు తెరిచి ఉంచడం:
ఇంట్లోని గాలి తాజాగా ఉండాలంటే సహజమైన గాలి ప్రవాహం చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ కొంతసేపు కిటికీలు తెరిచి ఉంచాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంటికి రెండు వైపులా ఉన్న కిటికీలను తెరిస్తే గాలి సులభంగా ప్రసరిస్తుంది. చలికాలంలో కూడా రోజుకు 15 నిమిషాలు కిటికీలు తెరవడం వల్ల ఇంట్లోని దుర్వాసనలు తగ్గుతాయి.
Also Read
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
మురికి ప్రాంతాలను శుభ్రం చేయడం:
కొన్నిసార్లు చిన్నచిన్న ద్రవాలు లేదా ఆహార పదార్థాలు కనిపించకుండా ఉండిపోతాయి. ఇవే తర్వాత దుర్వాసనలకు కారణమవుతాయి. చెత్త బుట్టలు, ఫ్రిజ్ డ్రాయర్లు, సాస్ బాటిళ్ల అడుగుభాగాలు, అల్మారాల మూలలు వంటి ప్రాంతాలను తరచూ శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిజ్ వెనుక ఉండే నీటిని కూడా శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
సహజ సువాసన కోసం:
ఇంట్లో సహజమైన, మంచి వాసన రావాలంటే ‘సిమ్మర్ పాట్’ మంచి ఎంపిక. నీటిలో నారింజ లేదా నిమ్మ ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి పదార్థాలను వేసి మరిగించాలి. ఆ తర్వాత మంటను తగ్గించి కొంతసేపు ఉంచితే ఇంటంతా ఆహ్లాదకరమైన వాసన వ్యాపిస్తుంది. నిమ్మ లేదా నారింజ తొక్కలను వంటగదిలో కొంతసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
ఇంట్లోనే స్ప్రే తయారీ:
మార్కెట్లో దొరికే చాలా క్లీనింగ్ స్ప్రేల్లో కృత్రిమ సువాసనలు ఉంటాయి. అందుకే ఇంట్లోనే సులభంగా క్లీనింగ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. అర కప్పు రబ్బింగ్ ఆల్కహాల్లో కొన్ని చుక్కల డిష్ సోప్ కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. అవసరమైతే కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఇది ఉపరితలాలను శుభ్రపరచడమే కాకుండా మంచి సువాసనను కూడా అందిస్తుంది.
ఎయిర్ ప్యూరిఫైయర్:
ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిలోని ధూళి, అలెర్జీ కారకాలు, సూక్ష్మక్రిములను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గాలి ప్రసరణను మెరుగుపరచి ఇంట్లోని దుర్వాసనలను తగ్గిస్తాయి. ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చడం ద్వారా ఇవి మరింత సమర్థంగా పనిచేస్తాయి.
ఇంట్లోనే మొక్కలు, పూలను పెంచడం:
సహజమైన సువాసన కోసం ఇంట్లో పూల మొక్కలు లేదా సువాసన వెదజల్లే మొక్కలను ఉంచడం మంచిది. యూకలిప్టస్, బే లీవ్స్, జునిపర్, ఫిర్ వంటి మొక్కలు మంచి సువాసనను అందిస్తాయి. అలాగే తాజా పూలను ఫ్లవర్ పాట్ లో అలంకరించడం ద్వారా ఇంటి అందం పెరగడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం