NTV Telugu Site icon

Tech Tips: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లపై హ్యాకర్ల నజర్

Hackers

Hackers

భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను మోసగించి డబ్బును దొంగలించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి కాల్ చేసి, అతనిని లేదా ఆమెను తమ మొబైల్‌కి యాక్సెస్ కోసం అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయమని రిక్వెస్ట్ పెడతారు.. లేదంటే తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు.. తద్వారా ఈ మోసగాళ్లు మొబైల్ ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్‌ను పొందిన తర్వాత బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును తమ సొంత అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు.

Also Read : Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి.. స్వగ్రామానికి పార్థివదేహం

ఇందుకోసం యూపీఐ యాప్‌ల వంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక పోలీసు కూడా తన మొబైల్ ఫోన్‌కు స్కామర్‌లకు రిమోట్ యాక్సెస్‌ను అందించే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తద్వారా దాదాపు రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి స్కామ్‌లను నిరోధించడానికి, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ఎల్లప్పుడూ మంచిది కాదు అని సైబర్ పోలీసులు వెల్లడిస్తున్నారు.

Also Read : LIC Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10,000 సులువుగా పొందవచ్చు..

సెక్యూరిటీ విషయంలో అనేక సార్లు మోసాలకు గురవుతుంటారు. మీరు కూడా అటువంటి ట్రాప్‌లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. స్కామర్‌లకు అనుకోకుండా మీ ఫోన్‌కి రిమోట్ యాక్సెస్ ఇవ్వడంలో ఆందోళన చెందుతున్నారా? స్కామర్‌లు మీ UPI IDని యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి కొన్ని భద్రతపరమైన ట్రిక్స్ పాటించండి. మీ యూపీఐ IDని ప్రొటెక్ట్ చేసేందుకు ఎల్లప్పుడూ టూ-ఫ్యాక్టరీ అథెంటికేషన్ సెటప్ చేసుకోవాలి.. అయితే, స్కామర్లు OTPలను పొందేందుకు SMS యాప్‌ను కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మీరు గూగుల్ పే, పోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఓపెన్ చేసేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడం మంచిది.

Also Read : Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

మీ ఫోన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్ ఉపయోగించడం వల్ల అదనపు ప్రొటెక్షన్ లేయర్ ను కూడా అందిస్తుంది. మీ యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ, మీ ఫేస్ చూపడం ద్వారా లేదా మీ ఫింగర్ ఫ్రింట్ పెట్టడం ద్వారా మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి.. మీ డివైజ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేస్తున్న స్కామర్‌లు అలాంటి సందర్భాలలో ఈ యాప్‌లను ఓపెన్ చేయలేరు.. మీ యూపీఐIDని మరింత జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

Also Read : Tuesday Stotra: ఈ స్తోత్రాలు వింటే పది రకాల పాపాలు తొలగిపోతాయి

అయితే మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్ చేసేందుకు స్క్రీన్‌పై ఇచ్చిన సూచనలను ఫాలో కావాలి.. మీ మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఆన్ చేసిన తర్వాత పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ అన్‌లాక్ చేసేందుకు మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ అకౌంట్ లావాదేవీలను అనధికార యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో సహయపడుతుంది.