ICC: టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ.. ఎంతంటే..?
- ఐసీసీ నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనున్న పాకిస్తాన్
- దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్న ఐసీసీ
- ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. వారి ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా తమ జట్టు గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. అయితే, పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఈ టోర్నమెంట్లో కనీసం 7వ లేదా 8వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ.. పాకిస్తాన్ ఖాళీ చేతులతో వెళ్లదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలి..- కైఫ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది. మరోవైపు.. ఈ టోర్నీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఒక మ్యాచ్ గెలిస్తే 34000 US డాలర్లు (30 లక్షలు) ఇస్తుంది. అయితే.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో కూడా సగం డబ్బులు.. దాదాపు 15 లక్షల రూపాయలు పాకిస్తాన్‌కు అందుతాయి. అంతే కాకుండా.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే అన్ని జట్లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష 25 వేలు ఇస్తామని ఐసీసీ ప్రకటించింది. ఈ విధంగా దాదాపు కోటి రూపాయలు అవుతుంది. దీంతో.. మొత్తం పాకిస్తాన్ జట్టుకు మొత్తం రూ.2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నుండి అందుకునే హోస్టింగ్ ఫీజు వేరే ఉంటుంది.
Posani Krishna Murali: విచారణకు సహకరించని పోసాని..
1996 తర్వాత పాకిస్తాన్లో జరుగుతున్న తొలి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది. కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతోంది. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం టోర్నమెంట్ ఫార్మాట్లో ఎనిమిది జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో ప్రతి గ్రూపులోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్ ఎ నుండి ఇండియా, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్స్‌లోకి ప్రవేశించగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. ఇంగ్లాండ్ గ్రూప్ బి నుండి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం సెమీ-ఫైనల్స్ రేసులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..