NTV Telugu Site icon

ICC: టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ.. ఎంతంటే..?

Pak

Pak

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. వారి ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా తమ జట్టు గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. అయితే, పాకిస్తాన్ జట్టు ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో కనీసం 7వ లేదా 8వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ.. పాకిస్తాన్ ఖాళీ చేతులతో వెళ్లదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలి..- కైఫ్

పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది. మరోవైపు.. ఈ టోర్నీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఒక మ్యాచ్ గెలిస్తే 34000 US డాలర్లు (30 లక్షలు) ఇస్తుంది. అయితే.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో కూడా సగం డబ్బులు.. దాదాపు 15 లక్షల రూపాయలు పాకిస్తాన్‌కు అందుతాయి. అంతే కాకుండా.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే అన్ని జట్లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష 25 వేలు ఇస్తామని ఐసీసీ ప్రకటించింది. ఈ విధంగా దాదాపు కోటి రూపాయలు అవుతుంది. దీంతో.. మొత్తం పాకిస్తాన్ జట్టుకు మొత్తం రూ.2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నుండి అందుకునే హోస్టింగ్ ఫీజు వేరే ఉంటుంది.

Posani Krishna Murali: విచారణకు సహకరించని పోసాని..

1996 తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న తొలి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది. కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతోంది. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఎనిమిది జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో ప్రతి గ్రూపులోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్ ఎ నుండి ఇండియా, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్స్‌లోకి ప్రవేశించగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. ఇంగ్లాండ్ గ్రూప్ బి నుండి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం సెమీ-ఫైనల్స్ రేసులో ఉన్నాయి.