పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ పతకాలు సాధించినందుకు భారత్ అథ్లెట్లకు ఎంత రివార్డ్ ప్రకటించాయో ఇప్పుడు చూద్ధాం.
READ MORE: NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
భారతదేశంలో పతక విజేతలకు ఎంత డబ్బు వస్తుంది?
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారి క్రీడాకారులకు కనీసం 33 దేశాలు నగదు బహుమతులు ఇస్తాయి. వీటిలో 15 దేశాలు గోల్డ్ మెడల్ కోసం $1,00,000 (సుమారు రూ. 82 లక్షలు) కంటే ఎక్కువ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయి. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.
READ MORE:Anshuman Gaekwad Dies: టీమిండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత!
ఏ దేశం ఎక్కువ మొత్తం ఇస్తుంది?
ఒలింపిక్ పతక విజేతలకు అత్యధిక రివార్డులు ఇచ్చే దేశం హాంకాంగ్. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హాంకాంగ్, బంగారు పతకానికి 768,000 డాలర్లు (దాదాపు రూ. 6.3 కోట్లు) చెల్లిస్తుంది. రజత పతకాలు సాధించిన అథ్లెట్లకు $380,000 (దాదాపు రూ. 3.1 కోట్లు) ఇస్తుంది. బంగారు పతకం కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఇజ్రాయెల్ 2,75,000 డాలర్లు (దాదాపు రూ. 2.2 కోట్లు) ఇస్తుంది. పెద్దమొత్తంలో నగదు ఇవ్వడంలో ఇజ్రాయెల్ రెండోస్థానంలో నిలిచింది. సెర్బియా 218,000 డాలర్లు (దాదాపు రూ. 1.8 కోట్లు)తో మూడో స్థానంలో ఉంది. ఆసక్తికరంగా, ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు 2021 టోక్యో గేమ్స్‌లో బంగారు పతకాలను గెలుచుకున్నారు.