Kerala Cunning Man : టిప్ టాప్ గా 5స్టార్ హోటల్ కి రాగానే వెల్ కం చెప్పారు.. వేషం చూసి ఆయనేదో ఆఫీసర్ అనుకున్నారు. ఆనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బో అని ఆశ్చర్యపోయారు. తియ్యగా మాట్లాడుతుంటే టిప్పు గ్యారెంటీ అనుకున్నారు. అడ్వాన్స్ తీసుకోకుండానే ఆశ్రయం ఇచ్చారు. స్వీట్లు పంచుతుంటే మనసు ఎంత మంచిదని కీర్తించారు. హోటల్ వదిలి వెళ్లే ముందు 100మందికి దావత్ అంటే అయ్యా నువ్వు మామూలోడివి కాదనుకున్నారు. ఆఖరుకు బిల్లు కట్టకుండా.. ల్యాప్ ట్యాప్ తో ఉడాయించడంతో ఆ హోటల్ సిబ్బంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
Read Also: Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ వ్యక్తి హోటల్ బిల్లు చెల్లించకుండా ఉడాయించాడు. హోటళ్లలో బస చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న 65 ఏళ్ల విన్సెంట్ జాన్‌ను ఆదివారం కొల్లాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకుని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విన్సెంట్ జాన్ పై తిరువనంతపురంలోని ఓ హోటల్ బిల్లు చెల్లించలేదని ఫిర్యాదు చేసింది. జాన్ తమిళనాడులోని తూత్తుకుడి వాసిగా తెలిపారు. కొల్లాంలోని ఓ దుకాణంలో ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం పోలీసులు అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయడం ద్వారా జాన్‌ను పట్టుకున్నారు.
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
హోటల్‌లోని సీసీటీవీలో రికార్డయిన ఛాయాచిత్రాల ఆధారంగా అతడిని గుర్తించారు. జాన్ అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడాడు. అతడి మంచి ప్రవర్తన చూసి రూం అడ్వాన్స్ కూడా తీసుకోలేదని హోటల్ సిబ్బంది తెలిపారు. అతను హోటల్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి.. అతను వెళ్ళి మళ్లీ వస్తా 100మందికి దావత్ ఇస్తాననడంతో సిబ్బంది నమ్మారని పోలీసులు చెప్పారు. ఎప్పటికీ రాకపోవడంతో పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. జాన్ కేరళలోనే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలలో గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.