Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthis Attack Saudi Arabia: ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై మరోసారి దాడికి పాల్పడినట్లు ప్రకటించారు. ఎర్ర సముద్ర తీరంలో ఉన్న రాబిఘ్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వెల్లడించారు. తమ దాడి లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుందని హూతీలు ప్రకటించినప్పటికీ.. ఎంతమేర నష్టం జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ ఘటనపై సౌదీ అరేబియా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సౌదీ అరేబియాలోని రాబిఘ్ ప్రాంతంలో పెట్రో రాబిఘ్ (Petro Rabigh) పేరుతో భారీ చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. సౌదీ అరామ్కో, జపాన్‌కు చెందిన సుమిటోమో కెమికల్ కంపెనీ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. ఎర్ర సముద్ర తీరంలో ఉన్న ఈ కేంద్రం జెడ్డాకు ఉత్తరంగా సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ లోతైన సముద్రంలో చమురు ఎగుమతులకు అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి.
గత జూలైలో ప్రారంభమైన కొత్త ఘర్షణల నేపథ్యంలో హూతీలు తమ దాడులను తీవ్రతరం చేసినట్లు సమాచారం. యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కొన్ని ప్రాంతాలను హూతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా కూడా యెమెన్‌లోని తమ మిత్ర బలగాలకు మద్దతుగా హూతీల స్థావరాలపై వైమానిక దాడులను పెంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని కీలక ఇంధన సంస్థ అరామ్కోకు చెందిన కేంద్రాలను హూతీలు గతంలోనూ లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14న సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రధాన చమురు నగరం ధహ్రాన్‌లోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో గణనీయమైన నష్టం జరిగినట్లు సమాచారం.
Also Read
- Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
- Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
- TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
- Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
తాజావార్తలు
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
ట్రెండింగ్
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..