Site icon NTV Telugu

Viral Video: బీజేపీ బహిష్కృత నేత హోట‌ల్‌ కూల్చివేత.. ఏకంగా 60 డైనమైట్లతో.. వీడియో వైరల్

Hotel Razed

Hotel Razed

Illegal Hotel Razed Video Goes Viral: మధ్యప్రదేశ్‌లో జగదీష్ యాదవ్ హత్య కేసుపై ప్రజల ఆగ్రహావేశాలతో సాగర్‌లోని సస్పెండ్ అయిన బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోట‌ల్‌ను కూల్చివేశారు. మిశ్రీ చంద్ గుప్తా అక్రమ హోటల్‌ను జిల్లా యంత్రాంగం మంగళవారం ధ్వంసం చేసింది. డిసెంబరు 22న జగదీష్ యాదవ్‌పై తన ఎస్‌యూవీతో గుద్ది హత్య చేసినట్లు బీజేపీ నేతపై ఆరోపణలు వచ్చాయి.ఇండోర్‌కు చెందిన ప్రత్యేక బృందం మంగళవారం సాయంత్రం హోటల్‌ను కూల్చివేసేందుకు 60 డైనమైట్‌లను పేల్చింది. క్షణాల్లో భవనం కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంది. ఈ హత్య కేసులో పోలీసులు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు.

ఇండోర్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్‌ జైరామ్‌ ప్యాలెస్‌ని సుమారు 60 డైనమైట్‌లను ఉపయోగించి ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో సెకండ్ల వ్యవధిలో నెటమట్టం అయ్యింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ఆర్య భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్‌ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. మిశ్రీ చంద్ గుప్తా హోటల్ జైరామ్ ప్యాలెస్ సాగర్‌లోని మకరోనియా కూడలికి సమీపంలో ఉంది. హోటల్‌ చుట్టూ ఉన్న భవనాల్లో నివసించే వారిని కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భవనాన్ని మాత్రమే కూల్చివేశామని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.

Chennai Techie: రోడ్డుపై గుంతను తప్పించుకునే ప్రయత్నంలో.. ట్రక్కును ఢీకొట్టి..

డిసెంబరు 22న కోరేగావ్‌లో నివాసం ఉంటున్న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్‌యూవీ వాహనంతో గుద్ది హత్య చేసినట్లు చంద్ర గుప్తాపై ఆరోపణలు వచ్చాయి. జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. ప్రజాసంఘాల ఎన్నికల్లో కిరణ్ యాదవ్ మిశ్రీ చంద్ గుప్తా భార్య మీనాపై 83 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఈ విద్వేషంతోనే జగదీష్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను మాక్రోనియాలోని కోరేగావ్ నివాసి. మాక్రోనియా కూడలిలో ఉన్న ఒక డైరీ ఫామ్‌లో పనిచేశాడు.

 

Exit mobile version