NTV Telugu Site icon

Hot Weather: వడగాల్పులు విరుచుకుపడతాయి.. ఈ మండలాల ప్రజలు జాగ్రత్త..

Hot Weather

Hot Weather

Hot Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. రేపు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు విరుచుకుపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7, అల్లూరి జిల్లా కొండైగూడెం, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు వెల్లడించారు.. 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు పేర్కొన్నారు.

Read Also: Odisha Train Accident: ఒడిశా సహాయ నిధికి కోహ్లీ విరాళం ఇచ్చాడా. నిజమా.. అబద్ధమా..? వైరల్ అవుతున్న న్యూస్..!

ఇక, రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది..

Read Also: Tej Pratap Yadav: మేము వంతెనలు నిర్మిస్తున్నాం.. బీజేపీ వాటిని కూలుస్తోంది..

మరోవైపు, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టార్‌ బీఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు.