Site icon NTV Telugu

Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

Dead

Dead

వనస్థలిపురం హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యువకులు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడపడంతో హోండా సిటీ కార్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోండా సిటీ కార్ లో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్న, శివ, సందీప్ జోహెల్ గా పోలీసులు గుర్తించారు.

Also Read:Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళి పల్టీ కొట్టింది హోండా సిటీ కార్ శివ,సందీప్ జోహల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. భారీగా పోలీసులు మోహరించడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version