Site icon NTV Telugu

Abdullapurmet: రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ఢీకొట్టిన లారీ.. స్టాట్‌లో ఇద్దరూ మృతి..

Accident

Accident

అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు స్పాట్‌లోనే మృతి చెందారు. తూప్రాన్ పేట్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేష్, లక్షీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టు మర్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

READ MORE: School Violence: టీచర్‌ను పొట్టు పొట్టు కొట్టిన పేరేంట్స్..

గత వారం కింద అబ్దుల్లాపూర్‌మెట్‌లో రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్‌నగర్‌లోని తొర్రూర్‌ క్రాస్‌ రోడ్డులో నివాసముండే దారమల్ల అశోక్‌ (27) గత ఆదివారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి వచ్చాడు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అశోక్‌ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

READ MORE: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..

Exit mobile version