పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో యువతి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బందెల నర్సింహ కుమార్తె హంసలేఖ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండటంతో బాటసింగారంలోని అన్నమాచార్య కాలేజ్ సెంటర్‌కు పరీక్ష రాసేందుకు ఆమె…
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు స్పాట్‌లోనే మృతి చెందారు. తూప్రాన్ పేట్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేష్, లక్షీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టు మర్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.