Child Abuse: మానవత్వం మంటగలిపే ఘటన.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి..!

Child Abuse

Child Abuse

Child Abuse: కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. స్వీట్స్ ఇస్తానని చెప్పి ఒక యువకుడు ఆరేళ్ల చిన్నారి పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. రంగస్వామి అనే యువకుడు ఆరేళ్ల బాలికను మోసం చేసి స్వీట్స్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడి చేశాడు. అయితే తల్లి తండ్రులు సరిగ్గా ఆ సమయంలో అక్కడికి రావడంతో అక్కడ జరుగుతున్న బాగోతాన్ని చూసి వారు కేకలు వేయడంతో.. ఆ యువకుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు.

Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

×
×
Ad

ప్రమాదాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే కౌతాళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రంగస్వామి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై అధికారుల దృష్టిని ఆకర్షించే ఈ ఘటనపై త్వరితగా న్యాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: Congress Committees: తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..