జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ చేసినట్లు తెలిపారు. మా కొడుకు ఆ అమ్మాయిని మర్చిపోయినప్పటికీ ఆమె మాత్రం వదలకుండా ఫోన్స్ చేస్తుందని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:Army Dogs: ఆర్మీ డాగ్స్ రక్త దానం.. ఈ విషయాలు తెలుసా?
నిన్న ఎవరో ముగ్గురు వచ్చి మా కొడుకు మల్లేష్ ను తీసుకెళ్లి చంపారని తండ్రి తెలిపాడు. అమ్మాయికి కూడా మా తమ్ముడు మల్లేష్ పై ఇష్టం ఉండేదని, మాది తక్కువ కులం అని అమ్మాయికి చెప్పినా అమ్మాయి తరచు ఫోన్స్ చేస్తుండేదని.. కావాలని అమ్మాయి తల్లిదండ్రులు చంపారని మల్లేష్ అక్క ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మల్లేష్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. పరువు హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:Jaishankar: టీఆర్ఎఫ్‌ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని స్వాగతించిన భారత్
యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రాజీ కుదుర్చుకోవాలని వెల్గటూర్ ఎస్ఐ ఒత్తిడి చేసినట్లు మృతుడి బంధువులు తెలిపారు.. మీరు నిరసన చేస్తే మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారని.. హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగాలని బంధువులు డిమాండ్ చేశారు.
