లంగర్‌హౌజ్‌లో ఆదివారం రాత్రి 25 ఏళ్ల వ్యక్తిని కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. మృతుడు వెళుతుండగా నలుగురు వ్యక్తులు ఆపి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారని వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కలీం (25) అనే వ్యక్తి సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరుఫున బంధువులు కలీంపై కక్ష్యగట్టి.. నిన్న ఆదివారం సాయంత్రం లంగర్‌హౌస్‌లో వెళ్తుండగా రోడ్డుపై దాడి చేశారు. దీంతో కలీం అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ హత్య చేసిన అమ్మాయి సోదరులు.. ఏడాదికాలంగా కలీంను చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Also Read :Kiren Rijiju Letter: కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధుల్ని చేర్చుకోండి.. కిరణ్ రిజిజు లేఖ
అంతేకాకుండా.. రెండుసార్లు కలీంను చంపేందుకు ప్రయత్నించారు అమ్మాయి సోదరులు. ఈ క్రమంలోనే.. నెల క్రితం కలీం భార్యని ఇంటికి పిలిపించుకున్న సోదరులు.. నిన్న ఇంటికి రమ్మని చెప్పి సోదరితో కలీంను పిలిపించారు. అయితే.. కలీం వస్తుండగానే రోడ్డుపైన కత్తెలతో దాడి చేసి హత్య చేశారు. హత్య చేసిన నలుగరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. హత్య చేసిన నలుగురి కోసం లంగర్ హౌస్ పోలీసులు గాలిస్తున్నారు.
