HONOR GT Pro: 6.78 అంగుళాల డిస్ప్లే, గేమింగ్ ప్రియులకు అత్యాధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా వచ్చేసిన హానర్ GT ప్రో!
- 6.78 అంగుళాల డిస్ప్లే,
- IP68, IP69 రేటింగ్
- 7200mAh బ్యాటరీ, 90W వైర్డ్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే జర్మన్ రైన్ TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 4.0 సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లీడింగ్ ఎడిషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.47GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 256GB, 512GB లేదా 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
హానర్ GT ప్రోలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్) ఉన్నాయి. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 7200mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 90W వైర్డ్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు DTS:X అల్ట్రా సౌండ్ ఎఫెక్ట్స్‌తో, 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, మరియు USB టైప్-C కనెక్టివిటీలు ఉన్నాయి.
Also Read
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
- AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
హానర్ GT ప్రో చైనాలో ఐస్ క్రిస్టల్ వైట్, ఫాంటమ్ బ్లాక్, బర్నింగ్ స్పీడ్ గోల్డ్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధరల విషయానికి వస్తే ఇవి 12GB+256GB – 3699 యువాన్స్ (సుమారు రూ. 43,250), 12GB+512GB – 3999 యువాన్స్ (సుమారు రూ.46,755), 16GB+512GB – 4299 యువాన్స్ (సుమారు రూ.50,265), 16GB+1TB – 4799 యువాన్స్ (సుమారు రూ.56,110)గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
ట్రెండింగ్
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా