Honey Rose: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా నటీనటుల ఫేట్ ను మొత్తం తిరగరాసేస్తోంది. ఓవర్ నైట్ లో స్టార్లను చేసేస్తోంది. అలా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హనీ రోజ్. మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే అంటూ బాలకృష్ణతో ఒక్క ప్రోమోలో కనిపించింది హనీ. అంతే అప్పటినుంచి అమ్మడి ఫేట్ మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వీరసింహారెడ్డి సినిమాకు ముందు అసలు ఈ బ్యూటీ ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అంతకుముందు తెలుగులో ఒక సినిమా చేసినా కూడా అంతగా గుర్తింపు వచ్చింది లేదు. ఏ ముహుర్తనా వీరసింహారెడ్డిలో ఈ సాంగ్ రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి హనీ రోజ్ కు ఫిదాగా మారిపోయారు కుర్రకారు. ఆమె అందాన్ని వర్ణించడం కూడా మొదలుపెట్టేశారు.
Pawan Kalyan: ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం
ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించేస్తోంది ఈ భామ. తాజాగా టైట్ బిస్కెట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో హనీ మత్తెక్కిస్తోంది. ఆ భంగిమలు, పరువాలు డ్రెస్ వేసుకున్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక అలా ఉంటే అబ్బాయిలు ఆగుతారా.. ఆ ఫోటోలను ట్రెండింగ్ గా మార్చేస్తున్నారు.హనీ ట్రాప్ అంటే ఏంటో వినడమే కానీ.. మొదటిసారి చూస్తున్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే వీరసింహారెడ్డి తరువాత ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మలయాళం లోనే కాకుండా తెలుగులో కూడా ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాలను ఓకే చేసిందని టాక్. మరి ముందు ముందు అమ్మడు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో బిజీ అవుతుందో చూడాలి.