NTV Telugu Site icon

Honda Dio 125 Price: స్మార్ట్‌కీతో హోండా డియో 125.. ధర ఎంతో తెలుసా?

Honda Dio 125

Honda Dio 125

Honda launches Honda Dio 125 Scooter in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) భారత మార్కెట్లో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేసింది. గురువారం భారత మర్కెట్‌లో ‘హోండా డియో 125’ స్కూటర్‌ను విడుదల చేసింది. డియో స్కూటర్‌ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 125 సీసీ ఇంజన్‌తో వచ్చింది. ఈ కొత్త స్కూటర్‌ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Honda Dio 125 Price:
హోండా యాక్టివా 125, హోండా గ్రాజియా 125 తర్వాత 125cc సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన మూడో స్కూటర్‌ ఇదే (హోండా డియో 125). డియో 125 స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. 83,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంది. స్మార్ట్‌ వేరియంట్‌ ధర రూ. 91,300 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా హోండా కంపెనీ నిర్ణయించింది. ఇందులో ఐడ్లింగ్‌ స్టాపింగ్‌ సిస్టమ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, సీట్‌, ఫ్యూయల్ లిడ్‌ అన్‌లాక్‌ చేయటానికి మల్టీ ఫంక్షన్‌ స్విచ్‌తో పాటు 171 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో ఈ స్కూటర్‌ వస్తుంది.

Also Read: Tomatoes For Flight Bookings: ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!

Honda Dio 125 Features:
హోండా యాక్టివా 125లో 123.97cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8.19 bhpని, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్‌, అల్లాయ్‌ వీల్స్‌ అమర్చారు. ఈ స్కూటర్ 7 రంగుల్లో అందుబాటులో ఉంది. పెర్ల్‌ సైరన్‌ బ్లూ, పెర్ల్‌ నైట్‌ స్టార్‌ బ్లాక్‌, మ్యాట్‌ మార్వెల్‌ బ్లూ మెటాలిక్‌, పెర్ల్‌ డీప్‌ గ్రౌండ్ గ్రే, మ్యాట్‌ యాక్సిస్‌ గ్రే మెటాలిక్‌, స్పోర్ట్స్‌ రెడ్, మ్యాట్‌ సాంగ్రియా రెడ్ మెటాలిక్‌ రంగుల్లో లభిస్తుంది.

Honda Dio 125 H-Smart key:
హోండా యాక్టివా 125 స్కూటర్‌లో స్మార్ట్‌కీ సదుపాయం ఇచ్చారు. దీంతో ఫిజికల్‌ కీ అవసరం ఉండదు. దీని ద్వారా కొంత దూరం నుంచే స్కూటర్‌ను లాక్‌, అన్‌లాక్‌ చేయొచ్చు. ఇక ఈ స్కూటర్‌పై కంపెనీ మూడేళ్ల ప్రామాణిక వారంటీని ఇస్తోంది. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత యజమానులు ఐచ్ఛిక వారంటీ ద్వారా మరో ఏడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

Also Read: Homemade Pimples Face Packs: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే అందమైన ముఖం మీ సొంతం!

Show comments