Homemade Pimples Face Packs: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే అందమైన ముఖం మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here is Best Pimples Face Packs Homemade: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పడే వర్షాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే వర్షాకాలంలో మీరు పలు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. దాంతో ముఖం మీద మొటిమలు కూడా వస్తాయి. మొటిమలు ముఖం యొక్క అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. చర్మాన్ని కూడా పాడు చేస్తాయి. మొటిమల వలన ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న వారు బాగా ఇబ్బందిపడతారు.
టీనేజ్ వయసులో ఉన్న వారు మొటిమలను వదిలించుకోవడానికి ఎన్నో రకాల క్రిములు వాడుతుంటారు. అయినా కూడా మొటిమల సమస్య వారిని వేధిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సహజ పదార్థాలతో చేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం వలన ఈజీగా మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మొటిమల సమస్య నుంచి బయటపడడానికి మీరు ఏ ప్యాక్ (Homemade Face Packs For Pimples) ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
Also Read
Also Read: Monsoon Health Tips: వేడి నీటిలో వీటిని కలుపుకుని తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది!
తేనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్ (Pimples Face Pack with Honey and Cinnamon):
మొటిమలసమస్య నుంచి బయటపడడానికి తేనె మరియు దాల్చిన చెక్కతో కూడిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయవచ్చు. ఈ రెండింటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక చెంచా తేనెను తీసుకుని.. దానికి ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
అలోవెరా, ముల్తానీ మట్టి (Pimples Face Pack with Multani Mitti and Aloe Vera):
వర్షాకాలంలో మొటిమలు వచ్చినట్లయితే అసలు విస్మరించవద్దు. కలబంద మరియు ముల్తానీ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయాలి. ఇందుకోసం ఒక గిన్నెలో 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకోండి. అందులో ముల్తానీ మట్టి మరియు కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.
Also Read: Peach Health Benefits: ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే ఫ్రూట్ ఇదే.. ఈరోజే ఆహారంలో చేర్చుకోండి!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!