NTV Telugu Site icon

Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!

Home Weight Loss Tips

Home Weight Loss Tips

Simple Home Workouts for Weight Loss: ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలంటే ‘వ్యాయామం’ చేయడం చాలా ముఖ్యం. యువకులు నుంచి పెద్ద వయసు వారికీ వర్కవుట్స్ చాలా అవసరం. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ వల్ల డైలీ వర్కవుట్స్ చేయడం చాలా మందికి కుదరడం లేదు. అయినా కూడా చింతించాల్సిన అవసరం లేదు. కేవలం 2 రోజులు వ్యాయామం చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. మీరు ఫిట్‌గా ఉండాలంటే ఏ వ్యాయామాలు (Weight Loss Tips) చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

కోర్ వ్యాయామాలు:
మొదటి రోజున మీరు కోర్ వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం చేయడానికి ముందుగా 15 సెకన్ల పాటు జంప్ స్క్వాట్‌లను చేయాలి. తర్వాత 20-30 సెకన్ల పాట ముంజేయి ప్లాంక్ చేయాలి. ఇదే 3 సార్లు రిపీట్ చేయాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఫిట్‌గా ఉంటుంది. అంతేకాదు ఊబకాయం రాదు. వారానికి 2 రోజులు ఈ వ్యాయామం చేయాలి. దాంతో మీరు ఫిట్‌గా ఉండగలరు.

Also Read: Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!

కార్డియో వ్యాయామం:
మూడవ రోజు మీరు కార్డియో వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామం 10-15 నిమిషాలు చేయాలి. ఈ వ్యాయామం చేయాలంటే మీరు ఒకే చోట నిలబడాలి. ఒకే చోట నిలబడి దూకడం, మెట్లు ఎక్కడం లేదా సైకిల్ తొక్కడం వంటివి చేయవచ్చు. స్విమ్మింగ్ కూడా ఒక రకమైన కార్డియో. ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేయడం ద్వారా మీరు ఫిట్‌గా ఉండొచ్చు.

స్కిప్పింగ్:
మీరు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే వారానికి 2 రోజులు స్కిప్పింగ్ చేయాలి. స్కిప్పింగ్ చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఇలా ఒక్కో వ్యాయామం వారానికి 2 రోజులు కొద్ది సమయం చేస్తే.. ఫిట్‌గా ఉంటారు.

Also Read: Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!

Show comments