Site icon NTV Telugu

Ear Problems: చెవిలో నుంచి చీము కారుతూ నొప్పిగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి?

Ear

Ear

Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు చేరుకుంటూ ఉంటుంది. ఆ నీరే తరువాత బయటకు వస్తూ ఉంటుంది. కొంత మందిలో చెవిలో క్రిములు పెరిగిపోయి నిరంతరం చీము కారుతూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఎక్కువైతే విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. చెవులు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. జ్ఞానేంద్రియాలలో ఒక భాగం. అందుకే చెవిలో సమస్యలను మొదటిలోనే పట్టించుకోకపోతే పెను ప్రమాదాలకు దారి తీస్తాయి.

Also Read: viral video : పెళ్లి పీటల మీదే ఆ పనికానిచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే నవ్వాగదు..

ఇక వంటింటి చిట్కాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే తులసి ఆకులను నూరి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని కొద్దిగా చెవిలో వేసుకుంటే సమస్య తగ్గుతుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తులసిని తాగితేనే కాదు ఇలా చెవిలో వేసుకున్న అక్కడ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇక వెల్లుల్లి రసం కూడా చెవి సమస్యకు మంచి మందు అని చెప్పుకోవచ్చు. దీనిని కూడా మెత్తగా రసంలాగా చేసి దానిని చెవిలో వేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ వెల్లుల్లి రసం చేయడం కోసం వెల్లిపాయలను కొంచెం ఆవాల నూనెలో వేసి వేయించాలి. తరువాత దానిని రసం చేసి చెవిలో వేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తులసి కూడా వ్యాధిని నయం చేయడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.  వద్దు అనుకంటే డాక్టర్ ని సంప్రదించి ఆయన ఇచ్చే మందులనే వాడండి. చెవి సమస్యలు రాకుడదు అనుకుంటే స్నానం చేసి వెంటనే టవల్ తో చెవులను శుభ్రం చేసుకోండి.

 

Exit mobile version