Child Marriages: దేశంలో బాల్యవివాహాల విషయంలో కేంద్రం ఓ నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం తక్కువ వయస్సు గల అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్న రాష్ట్రంగా జార్ఖండ్ అపఖ్యాతి పాలైంది. జార్ఖంఢ్‌లో మేజర్ కాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిల శాతం 5.8గా ఉందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన సర్వేలో తేలింది. 18 ఏళ్ల నిండక ముందే వివాహం చేసుకున్న అమ్మాయిల శాతం జాతీయ స్థాయిలో 1.9గా ఉంది. ఇందులో కేరళలో సున్న శాతం అంటే అత్యల్పంగా.. జార్ఖండ్‌లో 5.8 శాతం అంటే అత్యధికంగా జరుగుతున్నట్లు సర్వేలో కేంద్రం తెలిపింది.. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం ఉన్నాయని పేర్కొంది.
Premature Births : ముందస్తు ప్రసవాలకు అందోళనలే కారణమా..?
దేశం మొత్తమ్మీద పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే బాల్య వివాహాలు అధికమని వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని సగం మంది మహిళలు 21 ఏళ్లు రాకముందే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని వివరించింది. 21 ఏళ్లకు ముందే పెళ్లికుమార్తెలుగా మారుతున్న వారి శాతం పశ్చిమ బెంగాల్ లో 54.9 కాగా, జార్ఖండ్ లో 54.6 శాతం అని తెలిపింది. కాగా, ఈ సర్వే 2020లో నిర్వహించగా, నివేదికను గత నెలలో ప్రచురించారు. ఇదిలా ఉండగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, జార్ఖండ్‌లో 2015లో 32 మంది, 2016లో 27 మంది, 2017లో 19 మంది, 2018లో 18 మంది, 2019, 2020లో ఒక్కొక్కరు 15 మంది బాలికలు చనిపోయారు.
