Site icon NTV Telugu

Vangalapudi Anitha: ఈపూరుపాలెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

Home Minister

Home Minister

Vangalapudi Anitha: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సుచరిత కుటుంబ సభ్యులను హోం మంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులను అడిగి ఘటన జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆమె ప్రకటించారు.

Read Also: AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. యువతి హత్యోదంతం దారుణమని.. 48 గంటల్లో కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషయా ప్రకటించామన్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య బాధిత కుటుంబానికి చెక్కును అందిస్తారన్నారు. గత ప్రభుత్వంలో విచ్చల విడిగా గంజాయి వల్లనే రాష్ట్రంలో నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. విచ్చలవిడిగా నేటికి జరుగుతున్నాయన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని.. గంజాయి నిర్మూలన కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏంతటి వారైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.

 

Exit mobile version