Minister Vangalapudi Anitha: సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల పీఎస్‌యూ కనెక్ట్-2024 సదస్సులో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. మహిళలు ఏ స్థాయిలో వున్నా ఒక మహిళగానే ఈ సమాజం చూస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఒక విజన్ వున్న లీడర్.. మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అంటూ కొనియాడారు. మహిళలు బిజినెస్‌లో అభివృద్ధి చెందడం కోసం ఒక డ్రైవ్‌ని నిర్వహిస్తామన్నారు. ఏ వ్యాపార రంగంలోనైనా ఎలా అభివృద్ధి చెందాలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి మహిళ ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకుపోవాలని అన్నారు.
Read Also: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
జగన్మోహన్ రెడ్డి విమర్శలపై హోం మంత్రి వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో అనేక ఫార్మా ప్రమాదాలు జరిగాయని.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన 24 గంటల్లో ముఖ్యమంత్రి పరామర్శించారని.. క్షతగాత్రులకు భరోసా కల్పించామన్నారు. 24 గంటల్లో కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రులకు కూడా 24గంటల లోపే చెక్కులు అందజేస్తున్నామన్నారు. అచ్యుతాపురం ప్రమాదం జరిగిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.