Home Minister Vangalapudi Anitha: పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయని తీవ్రంగా విమర్శించారు. ఒక్కరోజు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నారు. చిన్నారి హత్యకేసును వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని, చిన్న గాయం లేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అస్ఫియా కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.
Read Also: Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య
అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి అత్యంత బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి వచ్చామన్నారు.వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. వైసీపీ నేతలు చిన్నారి హత్యను కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నాకరన్నారు.