NTV Telugu Site icon

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అభినందనలు..

Anitha

Anitha

అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు. కౌలాలంపూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీయడంతోపాటు అజేయంగా 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన షబ్నమ్ తన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. మీరు సాధించిన విజయం మరెంతో మందికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నా.. Jai hind! అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Read Also: Kakinada: ముద్రగడ నివాసానికి వచ్చిన వైసీపీ నేతలు.. ఘటనపై ఆరా

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది. ఈ మొత్తం టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఫైనల్‌తో సహా ఏడు జట్లపై వరుసగా విజయం సాధించింది.

Read Also: Dulquer: ఆకాశంలో ఒక తార కోసం కొత్త తారని దింపుతున్నారు!