అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు.