NTV Telugu Site icon

Home Minister Anitha: ముంబయి నటి కేసు.. తప్పు చేసిన ఎవర్ని వదిలే ప్రసక్తే లేదు..

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: ముంబయి నటి కాదంబరి జిత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితి వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని మంత్రి చెప్పారు. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు పేర్కొన్నారు. ముంబయి నటి కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Read Also: AP CM Chandrababu: ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష

కాగా, హీరోయిన్ జిత్వానీ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే.. ఇక. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చిన విషయం విదితమే.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం విదితమే.