NTV Telugu Site icon

Mahmood Ali: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు..

Mahmod Ali

Mahmod Ali

ఖమ్మం జిల్లాలో హోం మంత్రి మహమ్మూద్ అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మైనారిటీలు బాగా అభివధ్ధి చెందారు.. కాంగ్రెస్ 50 ఏళ్లు పరిపాలించి కూడా మైనారిటీల విద్య కోసం నిధులు కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు. విద్య పేదవారికి అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి మంచి విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అని హోం మంత్రి మహమ్మూద్ అలీ తెలిపారు.

Read Also: Acid Attack : వన్ సైడ్ లవ్.. తల్లీ కూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన యువకుడు

కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని హోం మంత్రి మహమ్మూద్ అలీ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మత కల్లోలం కూడా జరుగలేదు.. కాంగ్రెస్- టీడీపీ ప్రభుత్వాలు మత వివాదాలపై ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ పండగకు రెండు రోజులు సెలవు ఇస్తున్నారు అని మహమ్మూద్ అలీ వ్యాఖ్యనించారు.

Read Also: Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది.. అత్యధికంగా ఎక్కడంటే

రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు అని మహమ్మూద్ అలీ ఆరోపించారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి మిస్ గైడ్ చేశారు.. కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు ఉన్నారు.. బీఆర్ఎస్ లో మాత్రం ఒక్కరే సీఎం ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. నా మాటలను కొంత మంది వక్రీకరించారు, నా మాటలకు ఎవ్వరు అయినా బాధ పడితే క్షమించమని అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు.. క్షమాపణలు చెబుతున్నాను అని మహమ్మూద్ అలీ పేర్కొన్నారు.