NTV Telugu Site icon

Home Minister Anitha: వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా తొమ్మిది మంది మృతి చెందినట్టు మంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు. 14 జిల్లాల పరిధిలో 1,56,610 ఎకరాల్లో వరిపంట మునగినట్లు హోంమంత్రి తెలిపారు. 18,045 ఎకరాల మేర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఏడు జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తంగా 9 ఎన్డీఆర్‌ఎఫ్, 8 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల కోసం బోట్లు, ఓ హెలికాఫ్టర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

Read Also: AP CM Chandrababu: వర్షాలపై సీఎం సమీక్ష.. వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలి..