NTV Telugu Site icon

Home Minister Anitha: పవన్‌ కల్యాణ్‌ కామెంట్లపై స్పందించిన హోం మంత్రి అనిత.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా పొలిటికల్‌ హీట్‌ పెంచాయి.. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాను హోంమంత్రిని అయితే… పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని… అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, ఎన్డీఏ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్‌ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.. ఇక, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఆసక్తికర కామెంట్లు చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: నేడు పల్నాడు జిల్లాకు డిప్యూటీ సీఎం.. సరస్వతి పవర్ భూములపై ఫోకస్‌..

తాను హోంమంత్రిగా ఫెయిలయ్యానని పవన్ కల్యాణ్‌ అనలేదన్నారు హోం మంత్రి అనిత. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలను కట్‌ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు అనిత. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూతుళ్లు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిపై అనుచిత పోస్టింగ్స్ పెడుతున్నారన్నారు హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, ఈ నేపథ్యంలోనే ఆవేదనతోనే పవన్ కల్యాణ్‌ అలా మాట్లాడారు అని తెలిపారు.. నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినేన్న ఆమె.. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నాం అన్నారు.. పోలీసు శాఖ నిర్లిప్తత నుంచి బయటకు రావాలి అని హితవు చెప్పారు.. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు అంటూ విపక్షంపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..