Site icon NTV Telugu

Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!

Mahavatar Parshuraam

Mahavatar Parshuraam

భారతీయ చలనచిత్ర రంగంలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హోంబలే ఫిల్మ్స్, నేడు ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది విడుదలైన ‘మహావతార్: నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ యానిమేటెడ్ ఎపిక్ ఫ్రాంచైజీలో భాగంగా రెండో చిత్రం ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parshuraam) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.

Also Read : Deepika: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్.. వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!

హోంబలే ఫిల్మ్స్ మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీమహావిష్ణువు దశావతారాల నేపథ్యంలో మొత్తం 7 చిత్రాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2025లో వచ్చిన ‘నరసింహ’తో ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు రెండో భాగం పరశురాముడి అవతారంపై రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ భీభత్సంగా ఉంది. “ధర్మం పతనమైనప్పుడు, పరశు (గొడ్డలి) లేస్తుంది” అనే ట్యాగ్ లైన్‌తో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

అధర్మాన్ని అంతం చేసి, లోకంలో ధర్మాన్ని నిలబెట్టే పరశురాముడి పాత్రను దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యంత శక్తివంతంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం పిల్లల కోసం మాత్రమే కాకుండా, పెద్దలను కూడా అలరించేలా అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో ‘కాంతార: చాప్టర్ 1’, ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలు ఉండగానే, ఇలాంటి పౌరాణిక యానిమేటెడ్ చిత్రాలను ప్రకటించడం విశేషం. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ (Sam CS) సంగీతం అందిస్తున్నారు.

 

Exit mobile version