హోలీ పండగ అంటే చిన్నా, పెద్ద అందరికి సరదానే.. దేశ వ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.. జనాలంతా రంగులతో మునిగితేలుతున్నారు.. ఈ పండుగకు గొప్ప చరిత్ర ఉంది..సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.. అందరిలో ఫుల్ జోష్ ను నింపే ఈ పండుగ రోజున మరింత జోష్ నింపే తెలుగు హోలీ పాటలను ఒక్కసారి వినేద్దామా..
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే హోలీ పాట ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.. ఇప్పటికి ఆ పాట స్పెషల్ గానే వినిపిస్తుంది..
జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి నటించిన ఎమోషనల్ మూవీ రాఖీ.. ఈ సినిమా రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే’ అంటూ హోలీ సాంగ్‌తో తారక్ దుమ్మురేపాడు.. ఆ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఇప్పటికి హోలీ స్పెషల్ సాంగ్ గా వినిపిస్తుంది…
నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్ హోలీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. ఇప్పటికి హైలెట్ గా ఈ పాట వినిపిస్తుంది…
నమిత, వెంకటేష్ జంటగా నటించిన జెమిని సినిమాలోని దిల్ దివానా.. మై హసీనా..’ పాట లో కూడా హోలీ పండగ గురించే ఉంది.. ఆ పాట ఇప్పటికి ఎవరిగ్రీన్ హోలీ పాటే..
చిరంజీవి, ప్రభాస్ సినిమాల్లో కూడా హోలీ పాటలు ఉన్నాయి.. ఎన్నో తెలుగు పాటలు హోలీ ప్రత్యేకతను తెలుపుతున్నాయి.. ఇక హోలీ సందర్బంగా ఈ పాటను ఒక్కసారి వినేయ్యండి..