NTV Telugu Site icon

UP: సంభాల్‌లో 46 ఏళ్ల తర్వాత హోలీ.. మసీదు ముందు నుంచి డీజే ఊరేగింపు(వీడియో)

Up

Up

దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్‌ గన్‌లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు. హోలీ ఊరేగింపు సంభాల్‌లోని ఒక మసీదు ముందు నుంచి సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

READ MORE: Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..

వాస్తవానికి.. భస్మ శంకర్ ఆలయం అని కూడా పిలువబడే కార్తీక్ మహాదేవ్ దేవాలయం 1978లో మూసేశారు. మత అల్లర్లు నగరాన్ని కుదిపివేసిన తరువాత.. ఆలయం మూతపడింది. ఈ ఆయంలో46 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 13, 2024న తిరిగి తెరిచారు. ఈ దేవాలయానికి విముక్తి కలిగిన తర్వాత వచ్చిన మొదటి హోలీ ఇది. అందుకే భక్తులు, హిందువులు పెద్ద ఎత్తున డీజే చప్పుళ్లతో నగర పుర వీధులు గుండా డ్యాన్స్‌లు చేస్తే ఘనంగా హోలీ నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

READ MORE: CM Yogi: హోలీ సందర్భంగా హిందువులకు సీఎం యోగి కీలక సందేశం!

ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండండి.’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్‌లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య రెండు మతాల పండుగలు సామరస్యంగా జరుపుకుంటున్నారు.