Site icon NTV Telugu

Rs.2000Note: త్వరగా రూ.2000 నోట్లు మార్చుకోండి.. లేకపోతే బ్యాంకుల్లో ఇబ్బందులు పెరుగుతాయి

Banks

Banks

Rs.2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ 30వరకు టైం ఇచ్చింది. ఇప్పటికే చాలామంది తమ వద్దనున్న నోట్లు మార్చుకున్నారు. అయినప్పటికీ చాలామంది వద్ద ఇంకా నోట్లు మిగిలే ఉన్నాయి. మీ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలామంది ఇంకా టైం ఉంది కదా మార్చుకుందాంలే అన్న ధోరణితో ఉన్నారు. అయితే నోట్ల మార్పిడికి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. కానీ చివరి నిమిషం వరకు వేచి ఉండటం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్బీఐ కూడా ఆగస్టులో మిగిలిన 13 రోజులలో 7 రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించింది.

Read Also:Wife Nude Videos: ఛీ వీడసలు మనిషేనా.. అప్పు తీర్చలేక భార్యతో ఆ పని చేయించిన భర్త

ఇప్పుడు మీరు నోట్లను మార్చాలనుకుంటే వారం రోజుల్లో పూర్తి చేయాలి. మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే సకాలంలో పూర్తి చేయండి. ఎందుకంటే సెప్టెంబర్‌లో కూడా గణేష్ పూజ, శీకృష్ణ జన్మాష్టమి, అనేక ఇతర కారణాల వల్ల బ్యాంకులు మూతపడవచ్చు. మీరు మీ దగ్గరున్న నోట్లు మార్చుకునేందుకు కంపల్సరీ బ్యాంకులకు వెళ్లాలి. మీరు వెళ్లినప్పుడు బ్యాంకులకు సెలవు ఉంటే మీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి RBI జారీ చేసిన బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్‌లోని మిగిలిన 13 రోజుల పాటు ఏ రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకుందాం..

Read Also:Bro : బ్రో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..

ఆగష్టు 20 – ఆదివారం
ఆగస్ట్ 26 – నాల్గవ శనివారం
ఆగష్టు 27 – ఆదివారం
ఆగస్టు 28 – సోమవారం – ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 – మంగళవారం – తిరువోణం కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 – బుధవారం – రక్షా బంధన్ సెలవుల కారణంగా జైపూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగస్ట్ 31 – గురువారం – రక్షా బంధన్, శ్రీ నారాయణ గురు జయంతి కారణంగా కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్‌లలో బ్యాంకులకు సెలవు

Exit mobile version