HMPV Case: చైనాను అతలాకుతలం చేస్తున్న HMPV వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదు అయింది. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు నమోదైంది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక సర్కార్ తమ ల్యాబ్‌లో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఈ పాప విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం. HMPV లేదా హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ సాధారణంగా 11సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లల్లో వస్తుంది.
HMPV Case: భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్.. 8 ఏళ్ల చిన్నారికి నిర్ధారణ
- భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్..
- బెంగళూరులో నమోదైన తొలి కేసు..
- 8 నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్థారణ..
Show comments