NTV Telugu Site icon

Mokila Land Auction: మోకిలలో రెండో రోజు అదే జోరు.. ప్లాట్ల కోసం పోటీ

Mokila Land

Mokila Land

రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం పరిధిలోని మోకిల గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. అయితే, హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు రెండవ రోజు (గురువారం) అదే జోరు కొనసాగింది. మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాటు కొనుగోలు కోసం ఔత్సాహకులు ఈ – వేలంలో పాల్గొని పోటీపడి మరి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

Read Also: Viral Video: బాత్రూంలోని కమోడ్‌లో ‘పాము’.. చూస్తే ఖంగుతినాల్సిందే

రెండవ రోజు (గురువారం) ఉదయం 30 ప్లాట్లను వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.72,000లు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56,000ల వరకు వచ్చింది. ఇక, మధ్యాహ్నం 30 ప్లాట్ లకు వేలం జరగగా అన్ని అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.75,000లు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56,000ల వరకు పలుకుతు వచ్చింది. మొత్తంగా రెండవ రోజు గురువారం నాడు మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.131.72 కోట్ల రెవెన్యూ తెలంగాణ సర్కార్ కు వచ్చింది.

Read Also: Mahesh Babu: పుష్పను వదిలేసి మహేష్ తప్పు చేశాడా.. ?

ఇక, రేపు (శుక్రవారం.. 25వ తేదీన) మరో 60 ప్లాట్లను ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏ విక్రయించనున్నది. తిరిగి సోమవారం(28వ తేదీ), మంగళవారం(29వ తేదీ)లలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున మోకిల ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం ప్రక్రియలో అమ్మకానికి పెట్టనుంది. అయితే.. మోకిలలో ఉన్న ప్లాట్ల కోసం ఔత్సాహికదారులు పోటీ పడుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏ అధికారులు కొనసాగిస్తున్నారు.