NTV Telugu Site icon

Land Auction: మరోసారి భారీ భూ వేలం.. నోటిఫికేషన్ విడుదల

Land Action

Land Action

హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ రూపొందించిన లే అవుట్లు కావడంతో ఈ భూములు క్లియర్ టైటిల్ ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు అవసరమైన నిధులను ఈ భూములను అమ్మి వేస్తుంది.

Read Also: Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి

ఇక, హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ సర్కార్ సిద్ధం అయింది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ నేడ (సోమవారం) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మొకిలా దగ్గర మూడు వందల పాట్ల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు వందల ప్లాట్లలో 98వేల 975 గజాలను అమ్మకానికి కేసీఆర్ సర్కార్ పెట్టింది. ఈ లేఔట్‌లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది.

Read Also: Pakistani woman Seema Haider: భారత్ జెండాకు జేజేలు కొట్టిన పాకిస్తానీ మహిళ…వీడియో వైరల్

నేటి (సోమవారం) నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని హెచ్ఎండీఏ తెలిపింది. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా ఫిక్స్ చేశారు. మొకిలాలో మొదటి ఫేజ్‌లో గజానికి అత్యధికంగా ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలుగా రేటును నిర్ణయించారు. ఫెజ్ వన్‌లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397కు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్ఎండీఏ వెల్లడించింది.