హైదరాబాద్ లో ఇళ్లు, ఫ్లాట్స్ కానీ కొందామా అంటే ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోయాయి. పోనీ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేద్దామన్న వాటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక సామన్యుడు చేసేదేముంది అద్దె ఇళ్లలో గడపడం తప్పా. ఇప్పుడు నగర పరిధిలోని ఉప్పల్ భగాయత్ లోని లేఔట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఒకసారి వేలం జరగగా.. మరోసారి వేలంపాట నిర్వహించేందుకు హెచ్ఎండీఏ ( HMDA ) సిద్ధమైంది.
Read Also: Balayya: ఈ సినిమా మాస్ అనే పదానికే కేరాఫ్ అడ్రెస్… రీరిలీజ్ అవుతోంది కాస్కోండి
అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన 63 ప్లాట్లను వేలానికి హెచ్ఎండీఏ ( HMDA ) పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో 464 గజాల నుండి 11,374 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఇచ్చింది హెచ్ఎండీఏ, 28 వరకు ఈఎండీ చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. జూన్ 13న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు అధికారులు. జూన్ 30న ప్లాట్లను వేలం వేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వం రూ.35 వేలు నిర్దేశించింది. అధికారులు భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Kesineni Nani: బెజవాడలో పొలిటికల్ హీట్.. మరోసారి కేశినేని హాట్ కామెంట్స్..
గత వేలంతో ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. NRIలు సైతం పోటీ పడి ప్లాట్లు కొనుగోలు చేశారు. గజానికి లక్షా 60 వేల వరకు పలికింది. అయితే ఈ సారి 111 జీవో ఎఫెక్ట్ తో ఆ స్థాయిలో రేటు వస్తుందా లేదా అని అధికారులు ఆలోచనలో పడ్డారు. రీసెంట్ గా బాచుపల్లి, మేడిపల్లిలో సెకండ్ ఫేజ్ ప్లాట్ల వేలంలో ఉన్న ప్లాట్స్ అమ్ముడుపోలేదు. త్వరలోనే కోకాపేట భూములను వేలం వెయ్యడానికి హెచ్ఎండీఏ అధికారులు రెడీ చేస్తున్నారు.
