NTV Telugu Site icon

Parks Closed: ప్రధాని రాకతో రేపు హైదరాబాద్‌లో ఈ రెండు పార్కులు బంద్‌..

Parks

Parks

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అధికారులు (HMDA) నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు ప్రకటించారు.

Read Also: Anasuya: ఆ కుర్ర హీరో లైన్ వేస్తున్నాడనుకొని.. రంగమత్త అవైడ్ చేసిందట

ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. కమలం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.

Read Also: AP CM Jagan Tour: రేపు పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్‌.. రైతుల ఖాతాల్లో నగదు జమ

అయితే, బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారింది. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు భరోసా ఇచ్చేలా ప్రధాని మోడీ ఈ బహిరంగ సభలో మాట్లాడతారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. ఈ సభకు లక్ష మంది వరకు తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కమలం పార్టీ నేతలకు ఇప్పటికే నేతలు దిశానిర్దేశం చేశారు. ఇక, ప్రధాని మోడీ రేపటి సభ తర్వాత మళ్లీ 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రాకతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో ముమ్మరంగా తనీఖీలు చేప్పటారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.