HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.14,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. సిల్వర్ మిస్ట్, అక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ కలర్స్‌లో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అక్టోబర్ 8, 2026 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందించారు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 (ఆఫర్ ధర) కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
కెమెరా పరంగా వెనుక వైపు 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 682 ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో సర్వమ్ ఏఐకి చెందిన ఇండస్ ఏఐ అసిస్టెంట్ ఇచ్చారు. ఇది 22కంటే ఎక్కువ భారతీయ భాషల్లో పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుపరిచారు. ఇంకా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!