వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
- వృద్ధుల కోసం HMD 2660 ఫ్లిప్ సీనియర్ ఎడిషన్ లాంచ్.
- ప్రత్యేకంగా ‘మేరీ’ AI వర్చువల్ కంపానియన్ సదుపాయం.
- వృద్ధులతో మాట్లాడటం, కథలు చెప్పడం, మెమరీ గేమ్స్ నిర్వహించగల మేరీ.
- ప్రత్యేక యాప్, లాగిన్ లేదా పాస్వర్డ్ అవసరం లేకుండానే AI సేవ వినియోగం.
- ప్రారంభంగా 5 గంటల మేరీ AI సంభాషణ సమయం ఉచితం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMD 2660 Flip Senior Edition Launched: హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) తన ఫీచర్ ఫోన్ లైనప్‌ను మరింత పెంచుకుంది. ముఖ్యంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకుని HMD 2660 ఫ్లిప్ సీనియర్ ఎడిషన్ (HMD 2660 Flip Senior Edition) పేరుతో కొత్త ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకంగా ‘మేరీ’ (Mary) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ కంపానియన్ను అందించడం ప్రధాన ఆకర్షణ. వృద్ధులతో మాట్లాడటం, కథలు చెప్పడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన గేమ్స్ నిర్వహించడం వంటి పనులను మేరీ చేయగలదు. వృద్ధుల కోసం AI ఆధారిత కంపానియన్ సేవలను అందించే inTouch సంస్థతో HMD 2026 మార్చిలో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగానే మేరీ AI అసిస్టెంట్‌ను నేరుగా ఫోన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం లేదా క్లిష్టమైన సెటప్ ప్రక్రియలను పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
వృద్ధుల అవసరాలకు అనుగుణంగా మేరీని రూపొందించారు. ఇది సులభమైన భాషలో, నెమ్మదిగా మాట్లాడటంతో పాటు సంభాషణ సమయంలో ఎక్కువ విరామాలను కూడా అర్థం చేసుకునేలా రూపొందించారు. ప్రకృతి, చరిత్ర వంటి వివిధ అంశాలపై మాట్లాడటం, కథలు చెప్పడం, మెమరీ గేమ్స్ నిర్వహించడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా గత సంభాషణల్లోని కొన్ని వివరాలను గుర్తుంచుకుని తదుపరి సంభాషణలను మరింత వ్యక్తిగతంగా మార్చగలదు. ఫోన్ మెయిన్ మెనూలో మేరీని ఎంపిక చేసుకుని కాల్ బటన్ నొక్కడం ద్వారా ఈ AI సేవను ఉపయోగించవచ్చు. ప్రారంభ యాక్టివేషన్ తర్వాత ప్రత్యేకంగా లాగిన్ లేదా పాస్వర్డ్ అవసరం ఉండదు. ఈ సేవ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
Also Read
- 10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
- 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
- Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి ప్రారంభంగా 5 గంటల మేరీ AI సంభాషణ సమయం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత సేవను కొనసాగించాలంటే నెలకు €19.90 సబ్స్క్రిప్షన్ చెల్లించాలి. దీనికి అదనంగా మొబైల్ ఆపరేటర్ ఛార్జీలు వర్తించనున్నాయి. ఈ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యువల్ కాదు. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించకపోయినా ఫోన్లోని సాధారణ కాలింగ్, ఇతర ప్రాథమిక ఫీచర్లు యథావిధిగా పనిచేస్తాయి. ఈ ఫోన్లో 2.8 అంగుళాల QVGA ప్రధాన డిస్ప్లే, 1.77 అంగుళాల సెకండరీ డిస్ప్లే ఉన్నాయి. Unisoc T107 సింగిల్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 48MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు.
డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వెనుక భాగంలో VGA కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వైర్లెస్ FM రేడియో, MP3 ప్లేయర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 4G VoLTE, బ్లూటూత్ 4.2, USB టైప్-C సపోర్ట్ అందించారు. ఇందులో 1450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. 2G నెట్‌వర్క్‌పై గరిష్ఠంగా 20 గంటలు, 4Gలో సుమారు 6.5 గంటల టాక్‌టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మొబైల్ కోసి బ్లాక్ కలర్లో అందుబాటులోకి వచ్చింది. యూకేలో దీని ధర £79.99గా నిర్ణయించారు. ఇది సుమారు 107 డాలర్లు లేదా రూ.10,160కు సమానం. ప్రస్తుతం ఈ ఫోన్ HMD యూకే స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!